సమంత అడ్రస్ మారిపోయింది..

మరిన్ని వార్తలు

హీరోయిన్ సమంత పేరు మార్చుకుంది. అక్కినేని కుటుంబం లోకి అడుగుపెట్టి నాగ చైతన్య ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో ఒకటైన ట్విట్టర్ లో సమంత అక్కినేని గా పేరు మార్చుకుంది. ఇంతక ముందు సమంత రూత్ ప్రభు అని ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసింది. మిగతా అకౌంట్స్ లో మాత్రం ఆమె పేరు సమంత రూత్ ప్రభు అనే ఉంది.

ప్రస్తుతం సమంత ప్రధాన పాత్రలో నటించిన 'రాజు గారి గది 2' చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో ఆమె చేసిన పాత్ర కథకు చాలా ముఖ్యమని తెలుస్తుంది. నాగార్జున, సీరత్ కపూర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఇదే కాకుండా సమంత తమిళంలో విజయ్ సరసన నటించిన అదిరింది చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వీటితో పాటు తెలుగులో రామ్ చరణ్ తో రంగస్థలం1985, సావిత్రి చిత్రాలతో చాలా బిజీగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS