నటీమణులకి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పుణ్యామా అని ట్రోలింగ్ తీవ్రస్థాయిలో పెరిగింది. అయితే తాజాగా నటి సమంతా పెట్టిన ఒక ఫోటో పైన కొందరు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అదేంటంటే- బీచ్ లో బికినీ వేసుకొని ఉన్న ఫోటోని ఒకటి సమంతా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో పెట్టడం పైన అక్కినేని కుటుంబ అభిమానులు అని చెప్పుకునే వారు ఇటువంటి ఫోటో ఎందుకు పెట్టావు అంటూ ఆమె పైన విరుచుకు పడ్డారు.
దీనికి ఆమె సమాధానమిస్తూ- “తనకంటూ జీవితంలో కొన్ని రూల్స్ ఉన్నాయి అని. వాటిని తానే రాసుకుంటాను అని చెప్పింది. అలాగే మీరు మీ జీవితాల్లో రూల్స్ పెట్టుకోండి అంతేతప్ప వేరే వాళ్ళకి రూల్స్ మీరు పెట్టకరలేదు” అని చెప్పింది.
మొత్తానికి సమంతా తనకి నచ్చింది చేస్తాను అంటూ తనదైన స్టైల్ లో చెప్పేసింది. అయితే ఆమె అడుగుపెట్టిన కుటుంబానికి ఒక గౌరవం ఉంది అని దానిని ఆమె కాపాడాలి అని ఇంకొందరు ఆమె మాటలకి సెటైర్ వేస్తున్నారు.