అక్కినేని కోడలు, డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్, గోల్డెన్ బ్యూటీ అంటూ పలు రకాల బిరుదులతో ప్రశంసలు అందుకుంటోన్న సమంత ఇప్పుడు 'ఐరెన్ లేడీ' అనే ట్యాగ్‌లైన్‌ని కూడా అంది పుచ్చుకుంది. ఎందుకంటారా.? అయితే సోషల్ మీడియాలో లేటెస్ట్‌గా సమంత పోస్ట్ చేసిన వీడియో చూడాల్సిందే. ఈ వీడియోలో సమంత ఏకంగా 100 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసింది. మానసికంగా సమంత చాలా స్ట్రాంగ్ అన్నది తెలిసిన సంగతే. ఇప్పుడు శారీరకంగా కూడా సమంత ఇంత స్ట్రాంగ్ అని తాజాగా ప్రూవ్ అయ్యింది.
ఈ వీడియో చూసి ఆమె సన్నిహితులు ఇది ఎలా సాధ్యమైంది.? అని ఆశ్చ్యపోతుంటే, నెటిజన్లు సమంతను మీరెంతో స్పూర్తిదాయకం అంటూ పొగిడేస్తున్నారు. మహిళ తలచుకుంటే ఏదైనా సాధించగలదు అని ఇప్పటికే పలువురు మహిళలు ప్రూవ్ చేశారు. సినీ రంగంలో సమంత సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. ఇలాంటి సందర్భాలు ఆమెలోని మానసిక స్థైర్యాన్ని మరింత ఎక్కువగా చాటి చెబుతాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం సమంత 'ఓ బేబీ' సినిమాలో నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మామగారు నాగార్జున సినిమా 'మన్మధుడు 2'లో సమంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి తన షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది సమంత. మొన్నీ మధ్యనే విడుదలైన 'మజిలీ' ఆమెకు మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు, సూపర్ డూపర్ హిట్ అయ్యింది.