'ఓ బేబీ' అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అక్కినేని కోడలు సమంత తాజాగా తన ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. జిమ్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయడమంటే సమంతకు చాలా ఇష్టం. గతంలోనూ ఎన్నో క్రిటికల్ అండ్ రేర్ ఫీట్స్ చేసి, అదరహో అనిపించింది. శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవాలనుకునే సమంత, ఫిట్‌గా ఉండడమే అసలు సిసలు ఆరోగ్యం అని నమ్ముతుంది. తాజా వీడియోలో ఓ రాడ్‌ని పట్టుకుని అవలీలగా పైకి ఎక్కేస్తోంది. అచ్చు స్పైడర్‌లా అన్నమాట.
ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది ఈ వీడియోకి. అంత సులువుగా ఈ ఫీట్ చేస్తోందంటే, దీని వెనక సమంత పడిన కష్టం చాలా గొప్పదని అర్ధం చేసుకోవాలి. 'ఏదైనా నేర్చుకోవాలనుకుంటే, వెనకడుగు వేయకండి. మీ సామర్ధ్యం ఏంటో తెలిస్తే, మీరే ఆశ్చర్యపోతారు..' అంటూ ఓ ఇన్‌స్పైరింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది ఈ వీడియోకి. దాంతో ఈ వీడియోకి బోలెడన్ని లైకులూ, షేర్లు పోటెత్తాయి. సమంతకు సంబంధించిన ఏ చిన్న ఇష్యూ అయినా నెటిజన్స్‌కి ఎంతో ఇంట్రెస్ట్. అలాంటిది ఇంత ఇన్‌స్పైరింగ్ మెసేజ్ ఇస్తే లైక్ చేయకుండా ఉంటారా.? చెప్పండి. ఇక నెటిజన్సే కాదు, సమంతను అభినందిస్తూ చాలా మంది సినీ ప్రముఖులు కూడా ఈ వీడియోని లైక్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. దటీజ్ బేబీ. షి ఈజ్ సో స్ట్రాంగ్. అమేజింగ్.. అద్భుతం.. అంటూ సోషల్ మీడియాలో సమంతకు సెలబ్రిటీస్ నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.