సమంత చంపేసిందంతే.!

మరిన్ని వార్తలు

అక్కినేని కోడలు సమంత సోషల్‌ మీడియాలో చాలా చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్‌ లైఫ్‌లోని ఎంజాయ్‌మెంట్స్‌ని ఫోటోల రూపంలో పోస్ట్‌ చేసి ఫ్యాన్స్‌కి కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ని షేర్‌ చేస్తుంటుంది. అలా తాజాగా సమంత రెండు ఫోటోలు పోస్ట్‌ చేసింది. బ్లాక్‌ హాట్‌ డ్రస్సుతో సమంత మెరిసిపోతోంది ఈ ఫోటోల్లో. సమంత ఏం చేసినా ప్యాన్స్‌కి పండగే. ఇప్పుడీ ఫోటోలతో తెగ పండగ చేసేసుకుంటున్నారు.

 

దాదాపు టూ పీస్‌ బికినీని బ్లాక్‌ కలర్‌ నెట్టెడ్‌ లాంగ్‌ ఫ్రాక్‌తో కవర్‌ చేసింది. ఫేస్‌లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌తో ఆకట్టుకుంటోంది. ఇప్పుడీ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. పొగిడేవారు కొందరైతే, తిట్టేవాళ్లు ఇంకొందరు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. అలాగే భిన్న కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు నెటిజన్లు ఈ పిక్స్‌లో సమంతను చూసి. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. గ్లామర్‌ పాత్రలతో పాటు, డీ గ్లామర్‌ రోల్స్‌కీ సై అంటోంది. అలాగే హీరోయిన్‌ సెంట్రిక్‌ స్టోరీలు కూడా సమంత కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నాయి. 

 

సమంత నటిస్తోన్న 'బేబీ - ఎంత సక్కగున్నావే' ఓ ప్రయోగాత్మక సినిమా. ఈ సినిమాలో సమంత వృద్ధురాలి పాత్రతో పాటు, టీనేజ్‌ గాళ్‌ పాత్రలోనూ కనిపించనుంది. ఈ టీనేజ్‌ పాత్ర కోసం సమంత సూపర్‌ హాట్‌గా కనిపించనుందట. మరోవైపు చైతూతో 'మజిలీ' సినిమాలో సమంత నటిస్తోంది. అలాగే తమిళ '96' రీమేక్‌లోనూ సమంత నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా నటిస్తున్నాడు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS