అన్నదమ్ములిద్దరూ 'అల్లరి' చేయబోతున్నారా.?

మరిన్ని వార్తలు

ప్రముఖ దర్శకుడు ఇవివి తనయులు ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌లిద్దరూ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. అయితే తాజాగా వచ్చిన 'వినయ విధేయ రామ' సినిమాతో ఆర్యన్‌ రాజేష్‌ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. చరణ్‌కి అన్నయ్యగా కీలక పాత్ర పోషించిన ఆర్యన్‌ రాజేష్‌ మళ్లీ యాక్టివ్‌ కావాలనుకుంటున్నాడట. కాస్త సన్నబడి హీరోగా మళ్లీ ట్రై చేయాలనుకుంటున్నాడట. 

 

మరోవైపు అల్లరి నరేష్‌ కెరీర్‌ కూడా స్లోగానే నడుస్తోంది. సినిమాలు చేస్తున్నా విజయాలు వరించడం లేదు. 'సిల్లీ ఫెలోస్‌'తో కాస్త ఊపిరి పీల్చుకున్న అల్లరోడు త్వరలో 'మహర్షి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లరి నరేష్‌ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడీ అన్నదమ్ములిద్దరూ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారట. 

 

ఓ యంగ్‌ డైరెక్టర్‌తో ఈ సినిమా ఉండబోతోందట. సొంత బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందనీ సమాచారమ్‌. గతంలో ఆర్యన్‌ రాజేష్‌, అల్లరి నరేష్‌ కలిసి 'నా ఇష్టం' సినిమాలో నటించారు. అప్పట్లో కమర్షియల్‌గా మంచి విజయం అందుకుంది ఈ సినిమా. ఇంత లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలిక. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS