ఎన్టీఆర్ కోసం కథానాయికల వేట కొనసాగుతూనే ఉంది. బాబి దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు కావాలి. అయితే... వాళ్ల పేర్లని చిత్రబృందం ఇంతకుముందే రాశీఖన్నా పేరు ప్రకటించారు. మరో ఇద్దరు హీరోయిన్లని ఫిక్స్ చేయాలి. ఎంతమందిని సంప్రదించినా ఏవో కారణాలు చెబుతున్నారు తప్ప, కాల్షీట్లను ఖాయం చేయడం లేదు. నివేదా థామస్, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్... వీళ్లందరితోనూ చిత్రబృందం చర్చలు జరుపుతోంది. ఇప్పుడు సమంతపై ఫోకస్ పెట్టినట్టు టాక్. జనతా గ్యారేజ్ తరవాత సమంత సినిమాల్ని ఎంచుకొనే విషయంలో ఆచితూచి స్పందిస్తోంది. పెళ్లిపైకి మనసు లాగడం వల్లేమో.. సినిమాలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. అయితే.. ఇప్పుడు చరణ్ - సుకుమార్ సినిమాకి పచ్చజెండా ఊపింది. నాగచైతన్యతో నిశ్చితార్థం ముగిసిన వెంటనే.. చరణ్ సినిమా సెట్లోనే కాలు పెడుతోంది. ఇది తప్ప సమంత చేతిలో సినిమాఏం లేదు. అందుకే సమంత కాల్షీట్లు అయితే కావల్సినన్ని దొరికేస్తాయని, సమంతని ట్రై చేస్తున్నార్ట. చరణ్‌తో డేట్లు క్లాష్ అవ్వకపోతే.. ఎన్టీఈర్ సినిమాకి తప్పకుండా పచ్చజెండా ఊపే ఛాన్సుందని తెలుస్తోంది. బృందావనం, రామయ్యా వస్తావయ్యా, జనతా గ్యారేజ్‌లలో జంటగా కనిపించారు ఎన్టీఆర్ -సమంత. ఇది కూడా ఒప్పుకొంటే నెం.4 కి తలుపులు తెరచుకొన్నట్టే.