ఆ విషయంలో సమంత రెండోస్సారి.!

By iQlikMovies - May 24, 2018 - 15:39 PM IST

మరిన్ని వార్తలు

'రంగస్థలం', 'మహానటి' చిత్రాలతో తాజాగా సమంత ఖాతాలో రెండు సూపర్‌ హిట్స్‌ పడ్డాయి. ఈ రెండు సినిమాలతోనూ సమంత నటిగా చాలా మంచి పేరు తెచ్చుకుంది. 'రంగస్థలం' సినిమాలో ఇంతకు ముందెన్నడూ నటించని కొత్త తరహా పాత్రలో కనిపించి, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 

అలాగే 'మహానటి'లో కూడా స్టార్‌డమ్‌ పక్కన పెట్టేసి, ఇంపార్టెంట్‌ రోల్‌ నటించడం అనేది సమంతకే చెల్లింది. ఈ రెండు సినిమాల్లోని పాత్రలూ తనలోని నటిని ఛాలెంజ్‌ చేసే పాత్రలే కావడం విశేషం. తాజాగా సమంత మరో ఛాలెంజింగ్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే 'యూ టర్న్‌' సినిమా. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత అత్యంత ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించనుంది. రోడ్‌ టెర్రర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. 

సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌. ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌లో సమంత యాక్టింగ్‌లో పీక్స్‌కి చేరిపోయిందట. అలాగే కొన్ని సందర్భాల్లో గ్లిజరిన్‌ అవసరం లేకుండా నటించేసిందట. ఆల్రెడీ 'మహానటి'లో కూడా సమంత ఈ తరహా సీన్‌ కోసమే ఆ సినిమాకి సైన్‌ చేశానని చెప్పింది. అలా సెంటిమెంట్‌ సీన్స్‌కి సమంత బాగా కనెక్ట్‌ అయిపోతోందనే చెప్పాలి. 

శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఒరిజినల్‌ తెరకెక్కించిన డైరెక్టర్‌ పవన్‌ కుమారే తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌ ఈ సినిమాలో మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు విశాల్‌తో సమంత నటిస్తున్న 'అభిమన్యుడు' అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS