'ఎన్టీఆర్‌'లో సమంత సర్‌ప్రైజింగ్‌ రోల్‌.?

మరిన్ని వార్తలు

క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఎన్టీఆర్‌'లో అక్కినేని కోడలు సమంత ఓ సర్‌ప్రైజింగ్‌ రోల్‌ పోషించనుందట. తాజాగా అందుతోన్న సమాచారమ్‌ ప్రకారం దర్శకుడు క్రిష్‌ సమంతతో మాట్లాడాడట. ఆ రోల్‌ గురించి వివరించాడట. సినిమాకి ఇంపార్టెంట్‌ రోల్‌ కావడంతో, సమంతకి బాగా నచ్చడంతో ఆ రోల్‌లో నటించేందుకు సమంత ఓకే చెప్పిందని తెలుస్తోంది. 

ఈ మధ్య సమంత హీరోయిన్‌గానే కాకుండా ఇంపార్టెంట్‌ రోల్స్‌కి సై అంటోన్న సంగతి తెలిసిందే. ఇటీవల బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన 'మహానటి'లోనూ సమంత కీలక పాత్ర పోషించింది. అలాగే ఇప్పుడు 'ఎన్టీఆర్‌'లో కూడా. ఇప్పటికే 'ఎన్టీఆర్‌'లో విద్యాబాలన్‌ తదితర బాలీవుడ్‌ ప్రముఖ తారల భారీతనానికి తోడు సమంత అప్పియరెన్స్‌ కూడా తోడవడంతో, సినిమాకి మరింత వెయిట్‌ పెరగనుంది. అయితే సమంత ఈ సినిమాలో ఏ పాత్ర పోషిస్తోంది.. అంటే అది సస్పెన్స్‌ అట. 

ఖచ్చితంగా అది ఓ ఇంపార్టెంట్‌ అండ్‌ స్టన్నింగ్‌ రోల్‌ అని మాత్రం తెలుస్తోంది. ఇంతవరకూ సమంతను అలాంటి పాత్రలో చూడలేదట. బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్‌ జోరుగా సాగుతోంది. శ్రీదేవి పాత్ర పోషిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలయ్యలపై ఓ సాంగ్‌ చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలిసారి బాలయ్య నిర్మాణంలో రూపొందుతోన్న చిత్రం 'ఎన్టీఆర్‌'. 

భారీ అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి భాగానికి 'కథానాయకుడు', అనీ, రెండో భాగానికి 'మహానాయకుడు' అనే టైటిల్స్‌తో విడుదల చేస్తున్నారు. ఇంతకీ సమంత నటించేది ఏ భాగంలో అనేది కూడా తెలియాల్సి ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS