సమంత ఖాతాలో ఈ రికార్డు మీకు తెలుసా?

By iQlikMovies - April 01, 2018 - 11:49 AM IST

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సమంతకి 13వ సినిమా అట. అదేంటీ అర్ధం కాలేదా? అవునండి నిజమే 'రంగస్థలం' సమంతకి 13వ సినిమానే. ఎలా అంటారా? అమెరికా బాక్సాఫీస్‌లో 1 మిలియన్‌ డాలర్స్‌ క్లబ్‌లో చేరిన సమంత 13వ సినిమా 'రంగస్థలం'. అదీ సంగతి. 

'దూకుడు', 'జనతా గ్యారేజ్‌,' 'సన్నాఫ్‌ సత్యమూర్తి', 'అ,ఆ',' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మూెత్సవం', 'ఈగ', 'అత్తారింటికి దారేది' తదితర తెలుగు సినిమాలతో పాటు, 'తెరి', 'మెర్సల్‌', '24' తదితర తమిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఇలా సమంత నటించిన ఈ చిత్రాలు అమెరికన్‌ బాక్సాఫీస్‌లో మిలియన్‌ డాలర్స్‌ క్లబ్‌లో చేరున్నాయట. ఆ లిస్టులో తాజాగా 'రంగస్థలం' వచ్చి చేరింది. ఒక్క రోజులోనే మిలియన్‌ డాలర్స్‌ క్లబ్‌లో చేరిన సమంత సినిమా ఇది. పై సినిమాలన్నీ ఓ ఎత్తు. ఈ సినిమా ఒక్కటీ ఓ ఎత్తు అంటోంది సమంత. 

ఎందుకంటే, పర్‌ఫామెన్స్‌ పరంగా ఈ సినిమా సమంతకి ఎంతో స్పెషల్‌. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న అనగా మార్చి 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'రామలక్ష్మి'గా పల్లెటూరి అమ్మాయి గెటప్‌లో సమంత అబ్బో ఏం వయ్యారాలు పోయిందనుకున్నారు. వయ్యారాలేనా, యాక్టింగ్‌కి స్కోపున్న పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. చరణ్‌తో జోడీ కట్టిన సమంత తొలి చిత్రమిది. ఆ రకంగా కూడా ఈ చిత్రం సమంతకెంతో స్పెషల్‌. 

నెక్ట్‌ సమంత నటించిన 'మహానటి' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా, సమంత ఓ కీలకపాత్ర పోషిస్తోంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS