సమంతా-చైతుల ప్రేమ ఆ తరువాత పెళ్ళిని ఈ తరంలో ప్రేమించి పెళ్ళి చేసుకున్న హీరో-హీరోయిన్లందరిలోనూ ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. దీనికి అనేక కారణాలుండగా, వీరు ఇరువురు ఒక సినిమా వేడుకలో తమ ప్రేమ గురించి ఎవ్వరికి తెలియని కొన్ని వివరాలని చెప్పడం జరిగింది.
ఇంతకి ఇదంతా జరిగింది చిలసౌ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో చైతన్య-సమంతాలు తమ ప్రేమ ఎలా చిగురించింది ఆ తరువాత ఆ ప్రేమ.. పెళ్ళిగా మారడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది అన్న విషయాలు చెప్పారు. అయితే ఇద్దరు సరదాగా తన ప్రేమ కోసం నేను వెంటపడ్డాను అని చైతు చెప్పగా దానిని వెంటనే ఇది ఒక పెద్ద అబద్ధం అంటూ సరదాగా సమంతా ఖండించింది.
ఇక సమంతా మాట్లాడుతూ- చైతుని చూడగానే ఇష్టపడ్డాను అని తనది “తొలిచూపు ప్రేమ” అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే చివరికి మాత్రం తమకి ఇద్దరికి పరిచయం అయిన 9 ఏళ్ళకి పెళ్ళి చేసుకున్నాము అని చెప్పారు.
ఏదేమైనా.. చిలసౌ గురించి మాట్లాడతారు అంటే తమ ప్రేమ.. పెళ్ళి గురించి చెప్పడం కొసమెరుపు.