అక్కినేని ఫార్ములా సక్సెస్‌ అయినట్లే!

మరిన్ని వార్తలు

తాజాగా ముద్దుగుమ్మ సమంత 'రాజుగారి గది - 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల అంచనాలను అందుకుంది ఈ సినిమాతో సమంత. లా చదువుకున్న అమ్మాయి అమృత పాత్రలో సమంత నటన ఆకట్టుకుంటోంది. అలాగే దెయ్యం పాత్రలో సమంత తనలోని కొత్త టాలెంట్‌ని బయటికి తీసింది ఈ సినిమాతో. కొత్త జోనర్‌ మూవీ. అందులోనూ పెళ్లి తర్వాత వచ్చిన తొలి చిత్రం. అలాగే మామగారయ్యాక నాగార్జునతో కలిసి నటించిన తొలి చిత్రం.. ఇలా ఈ సినిమాతో సమంతకు చాలానే కొత్త కొత్త అనుభవాలున్నాయి. ఇక సినిమా విషయానికి వస్తే, మామూలు సాదా సీదా హారర్‌ కామెడీ చిత్రం కాదిది. ఈ సినిమాతో ఓ మంచి మెసేజ్‌ని కూడా పాస్‌ చేశారు. మహిళల రక్షణ, అసలు జీవితం అంటే ఏమిటి? అనే అంశాలపై అవగాహన కలిగేలా ఉంది ఈ సినిమా. ప్రతీ ఒక్క అమ్మాయి, ప్రతీ మహిళ చూడదగ్గ సినిమా ఇది. అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌, మనసుకు హత్తుకునే కథా, కథనాలు అన్నీ కుదిరాయి ఈ సినిమాకి. ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. నాగార్జున మెంటలిస్ట్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. అక్కినేని ఫ్యామిలీలోకి ఎంటర్‌ అయ్యాక, మామా, కోడళ్లు కలిసి పని చేసిన సినిమాగా 'రాజుగారి గది - 2' సినిమా నాగ్‌, శామ్‌లకి ఓ మంచి సినిమా అవుతుందనడంలో అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సమంత 'రంగస్థలమ్‌' సినిమాలో నటిస్తోంది. రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS