'భళ్లాలదేవ' కొత్త గెటప్‌ చూస్తారా?

మరిన్ని వార్తలు

'బాహుబలి' చిత్రంలో భళ్లాలదేవగా ఆకట్టుకున్న రానా ఇప్పుడు స్వాతంత్య్రానికి ముందు కాలంలోకి ఆడియన్స్‌ని తీసుకెళ్తానంటున్నాడు. రానా కొత్త సినిమా '1945'. స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు రానా. అందుకోసం ప్రత్యేకమైన గెటప్‌ కూడా వేయబోతున్నాడు. ఆ గెటప్‌కి సంబంధించిన ఓ ఫోటోని రానా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. 'కాలాన్ని పునఃసృష్టించబోతున్నాం. ఇప్పుడు ఇది 1945. నా తర్వాతి చిత్రం '1945'. రెండో షెడ్యూల్‌ నేటి నుండి ప్రారంభం కాబోతోంది అంటూ ట్వీట్‌ చేసి, 'బ్రిటీష్‌ ఇండియా' అని ఇండియా మ్యాప్‌పై రాసి ఉన్న ఫోటోని పోస్ట్‌ చేశాడు. స్వాతంత్య్రానికి ముందు ఫ్రీడమ్‌ ఫైటర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ దళంలోని ఓ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్నాడు. అందాల రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. సత్య శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ముఖ్యమంత్రిగా తన సత్తా చాటిన రానా, ఇప్పుడు మరో ప్రయోగం చేయబోతున్నాడన్న మాట. 'బాహుబలి'లో క్రూరమైన విలన్‌గా నటించి, 'నేనే రాజు నేనే మంత్రి'లో రాజకీయ నాయకుడి పాత్రలో మెప్పించి, ఇప్పుడు సైనికుడిగా అలరించనున్నాడు రానా. సినిమా సినిమాకీ వేరియేషన్స్‌ చూపిస్తూ నటనలో తనదైన కొత్త శైలిని ప్రదర్శిస్తున్న రానాకి హ్యాట్సాప్‌ అనాల్సిందే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS