సమంతా ఓ నటిగానే కాకుండా ఒక సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా కూడా పేరు సంపాదించింది. అందుకు ఉదాహరణగా తను నడిపించే ప్రత్యూష ఫౌండేషన్ అని చెప్పొచ్చు.
ఇక విషయానికి వస్తే, సమంతాని ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్టు వార్తాలు వెలువడ్డాయి. వీటికి బలాన్ని చేకూరుస్తూ, మంత్రి కేటీఆర్ ని సమంతా కలవడం ఆ పైన తెలంగాణ రాష్ట్రంలోని చేనేత వస్త్రాల తయారు చేసే ప్రదేశాల్లో ఆమె పాల్గొనడం జరిగాయి.
అయితే ఈ పరిణామాల పై చేనేత ఐక్య వేదిక సభ్యులు ఆర్టీఐ ద్వారా చేనేత వస్త్రాలకి సంబంధించి సమంతా పాత్ర ఏంటి అనే దాని పై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనికి తెలంగాణ ప్రభుత్వం, తాము సమంతాని ఎటువంటి స్థానంలో నియమించలేదని జవాబు ఇచ్చింది. ఈ సమాధానంతో ఒక్కసారిగా సమంతా ఫ్యాన్స్ ఖంగుతిన్నారు.
మరి దీని పై అక్కినేని కోడలు ఎలా స్పందిస్తుందో చూడాలి.