సమంత భలే షాకిచ్చిందే.!

By iQlikMovies - June 03, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

'ఓ బేబీ' పోస్టర్స్‌తో సమంత స్పెషల్‌ కిక్‌ ఇస్తోంది. వరుసపెట్టి విడుదలవుతోన్న ఈ సినిమా పోస్టర్లు సినిమాపై మరింత ఆశక్తిని పెంచేస్తున్నాయి. మొన్న విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. 'మిస్‌ గ్రానీ' అనే కొరియన్‌ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సమంతతో పాటు, సీనియర్‌ నటి లక్ష్మీ కీలక పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. 60 ఏళ్ల బామ్మ ఎలా 16 ఏళ్ల అమ్మాయిగా మారిపోయింది.? అనే కాన్సెప్ట్‌తోనే ఆడియన్స్‌లో ఆశక్తి పెంచేశారు.

 

ఇక ఈ సినిమాకి సమంత స్టార్‌డమ్‌ కూడా చేరడంతో సినిమాపై అంచనాలు బాగున్నాయి. ఇక లేటెస్ట్‌గా సమంత ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఓ పక్క బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ ముసలి వయసులో ఉన్న రాజేంద్రప్రసాద్‌, ఇంకో పక్క కొడుకు అంటూ రావు రమేష్‌, మనవడు అంటూ తేజని పరిచయం చేస్తూ ఉన్న పోస్టర్‌ అది. పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో యంగ్‌ హీరో నాగశౌర్య మరో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తున్నాడు. జూలై 5న 'ఓ బేబీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS