ఈ సారీ బోణీ సమంతదే!

మరిన్ని వార్తలు

ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో 'ఎఫ్‌ 2' మంచి హిట్‌ కొట్టింది. తర్వాత ఏప్రిల్‌ వరకూ సూపర్‌ హిట్‌ సినిమాలు పడలేదు. ఏప్రిల్‌లో సమంత 'మజిలీ'తో బ్లాక్‌ బస్టర్‌ బోణీ కొట్టి, తర్వాత వరుసగా ఆ సక్సెస్‌ని 'చిత్రలహరి', 'జెర్సీ' సినిమాలకు కొనసాగించింది. ఆ తర్వాత మే, జూన్‌ డల్‌ అనే చెప్పాలి. ఈ వరుసలో 'మహర్షి' భారీ అంచనాలతో పెద్ద సినిమాగా విడుదలై, హిట్టు లాంటి హిట్‌ కొట్టినా, బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ అనే టాక్‌ సంపాదించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు జూలై వచ్చింది. జూలైలో సినిమాలు వరుస కడుతున్నాయి.

 

అంచనాలున్న సినిమాలే ఉన్నాయి ఈ వరుసలో. అయితే, మంచి బోణీ పడాలి. ఆ బోణీ ఇంకెవరిది.? మన బేబీదే. సమంత ముందుంటే చాలు, ఆ సినిమా హిట్‌ అనే సెంటిమెంట్‌ బాగా ఎక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. సో సమంత నటించిన 'ఓ బేబీ'తో బాక్సాఫీస్‌కి బోణీ కొట్టబోతోంది ఈ జూలై. ఈ నెల 5న 'ఓ బేబీ' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాతి వారం యూత్‌ కంటెంట్‌ మూవీ 'దొరసాని' లైన్‌లో ఉంది. దీంతో పాటు, సందీప్‌ కిషన్‌ నటించిన 'నిను వీడని నీడను నేనే' హారర్‌ బేస్‌డ్‌ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ అంచనాలు రేకెత్తిస్తోంది.

 

ఆ పై భారీ అంచనాలతో వస్తున్నాడు 'ఇస్మార్ట్‌ శంకర్‌'. ఈ సినిమాపైనా బాక్సాఫీస్‌కి అంచనాలున్నాయి. ఇకపోతే అసలు సిసలు బాక్సాఫీస్‌ మొనగాడు సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ 'డియర్‌ కామ్రేడ్‌'తో రాబోతున్నది కూడా ఈ నెల్లోనే. జూలై 26న ఈ సినిమా గ్రాండ్‌ రిలీజ్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. చూడాలి మరి ఈ నెల సమంత బోణీతో బాక్సాఫీస్‌కి కాసుల గలగల ఎలా ఉండబోతోందో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS