తెలుగులో సమంతకు అవకాశాలు రావడం లేదా.? లేక నిజంగానే సమంత తెలుగు సినిమాలను ఒప్పుకోవడం లేదా.? ఈ రెండు అనుమానాలు సమంత అభిమానుల్ని డిస్ట్రబ్ చేస్తున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. తమిళంలో లేటెస్ట్‌గా సమంత ఓ హారర్ ప్రాజెక్ట్‌కి ఓకే చేసిందనీ సమాచారం. తాప్సీతో ‘గేమ్ ఓవర్’ చిత్రం తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఓ హారర్ ప్రాజెక్ట్ ప్రపోజల్‌ని సమంత వద్దకు తీసుకొచ్చాడట. ఆ కాన్సెప్ట్ సమంతకు నచ్చిందట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందనీ తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉంది. కానీ, తెలుగులో ‘ఓ బేబీ’ తర్వాత ‘జాను’ సినిమాలో నటించింది సమంత. ఈ సినిమా రిజల్ట్ సమంతకు కలిసి రాలేదు. ఆ తర్వాత సమంత ఖాతాలో మరో సినిమా ఊసే లేదు.
ఇదంతా ఓ ఎత్తయితే, సమంత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండబోతోందట అనే వార్తలు కూడా మరోవైపు. సినిమాకు దూరంగా ఉండానుకుంటే, తమిళ ప్రాజెక్టు కూడా ఓకే చేయదు కదా. అలాంటిది ఇక ఇప్పుడు తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు తెలుగు ప్రాజెక్ట్స్ ఎందుకు ఓకే చేయడం లేదు.? మరోవైపు డిజిటల్ రంగంపై సమంత ఎక్కువగా దృష్టి పెట్టిందన్న సంగతీ తెలిసిందే. ఆ క్రమంలోనే ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో సమంత లీడ్ రోల్ పోషిస్తోంది. ఇదిలా ఉంటే, నిర్మాణ రంగంలోనూ సమంత ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఏం చేసినా తన ప్రాధాన్యత కీలకంగా ఉండేలా సమంత చూసుకుంటోందనుకోవాలి.