‘మహానటి’లో సమంతా సంగతేంటి?

మరిన్ని వార్తలు

మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం- మహానటి. నిన్న సావిత్రి గారి స్మృతిలో ‘మహానటి’ చిత్రానికి సంబందించిన టైటిల్ లోగో నిన్న విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ లోగో తో పాటు సినిమా విడుదల తేదీని కూడా ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, ఒక కీలక పాత్రలో సమంతా నటిస్తున్న సంగతి విదితమే. ఇప్పుడు ఆమె చేస్తున్న ఆ పాత్ర పైనే అందరి దృష్టి నెలకొంది.

 

కొంతమందేమో ఆమె నటి జమున పాత్రలో కనిపించనున్నారు అని మరికొంతమంది మాత్రం ఆమె ఈ కథని ప్రేక్షకులకి చెప్పే ఒక విలేకరి పాత్రలో కనపడనున్నారు అని అంటున్నారు. ఏదేమైనా ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండడం మరింత ఆసక్తి చెందుతున్నది. 

మరి సమంతా ఏ పాత్రలో మెరవనుందో చూడాలి ఇక...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS