ఊ అంటావా మావా, ఉహూ అంటావా మావా పాట తో ఒక ఊపు ఊపింది సమంత. తన కున్న స్టార్ డమ్ పక్కన పెట్టి 'పుష్ప' సినిమాలో ప్రత్యేక గీతంలో బన్నీతో కలిసి నర్తించింది సామ్. పుష్ప మూవీ ఎంతటి విజయాన్ని సాదించిందో తెలిసిన విషయమే. ఈ మూవీ సాంగ్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న తో సమానంగా సమంతకి కూడా పేరు వచ్చింది. ఒక స్పెషల్ సాంగ్ లో చిందేసి వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకోవటం మామూలు విషయం కాదు. దేశ, విదేశాల్లో ఊ అంటావా మావా పాట చాలా ఫేమస్ అయ్యింది. ఎందరో సెలబ్రిటీలు ఈ పాటకు కాలు కదిపారు.
మొదటి పార్ట్ కి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కుతుంది. టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ సినిమాల్లో 'పుష్ప: ది రూల్' ఒకటి. రెండో పార్ట్ లో కూడా స్పెషల్ సాంగ్ ఉంటుందని , సుకుమార్ పేర్కొన్నారు. మళ్ళీ సమంతే స్పెషల్ సాంగ్ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సాంగ్ లో జాన్వీ ఫిక్స్ అయ్యింది. దీనితో ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో సామ్ లేదని ఆమె ఫాన్స్ ఉస్సురన్నారు. కానీ వారిని సంతోష పెట్టే వార్త ఒకటి వినిపిస్తోంది. అదేంటి అంటే 'పుష్ప 2'లో సమంత కామియో రోల్ చేయనుందని టాక్.
పుష్ప 2 చివరిలో కొన్ని క్షణాలు కనిపిస్తుదంటూ, ఆ క్యారక్టర్ పుష్ప 3 లో కొనసాగింపు అవుతుందంటూ, మూడో భాగంలో సామ్ కి ఎక్కువ స్కోప్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నన బన్నీ ఓ ఇంగ్లిష్ చానల్‌తో మాట్లాడుతూ 'పుష్ప'ని ఫ్రాంచైజ్ చేయాలనుకుంటున్నామని, 3rd పార్ట్ కూడా ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. దీనితో మూడో భాగంలో సామ్ నటించటం గ్యారంటీ అని తెలుస్తోంది. ఆగస్ట్ 15న వరల్డ్ వైడ్ గా పుష్ప 2 ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ సారి ఎన్ని రికార్డులు కొల్లగొడతాడో పుష్ప రాజ్ చూడాలి.