'బి - పాజిటివ్‌' ఫిట్‌నెస్‌ మంత్ర: సమంత లుక్‌ చూశారా.?

మరిన్ని వార్తలు

మెగా కోడలు ఉపాసన 'బి - పాజిటివ్‌ హెల్త్‌ అండ్‌ లైఫ్‌ స్టైల్‌' అనే మ్యాగజైన్‌కి ఛీఫ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు ఈ మ్యాగజైన్‌లో తమ తమ ఫిట్‌నెస్‌ అనుభవాల్ని, సూచనల్ని అభిమానులతో షేర్‌ చేసుకుంటుంటారు. అంతేకాదు, ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌పై తమ తమ అందమైన హాట్‌ ఫిట్‌నెస్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటుంటారు.

 

ఇంతవరకూ రామ్‌చరణ్‌, సల్మాన్‌ఖాన్‌, షారూఖ్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌, కరీనా కపూర్‌, అలియాభట్‌.. ఇలా తదితర సెలబ్రిటీల ఫోటోలు ఈ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌పై దర్శనమిచ్చాయి. తాజాగా అక్కినేని కోడలు సమంత ఈ మ్యాగజైన్‌పై తళుక్కున మెరిసింది. మెగా కోడలు ఉపాసన, స్వయంగా సమంతను ఇంటర్య్యూ చేసింది. ఆ ఇంటర్య్వూకి సంబంధించిన కొన్ని పిక్స్‌ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫిట్‌ అండ్‌ సూపర్‌ స్టైలిష్‌గా ఉన్న సమంత ఈ లుక్స్‌కి నెటిజన్స్‌ నుండి కామెంట్స్‌ పోటెత్తుతున్నాయి. అంతేకాదు ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన, 'టాలీవుడ్‌ బెస్ట్‌ కోడలు' అంటూ సమంతకు మెగా సర్టిఫికెట్‌ ఇచ్చేసింది. అక్కినేని వారి కోడలిగా ఓ పక్క కెరీర్‌లో ఎంతో బిజీగా గడుపుతూనే, మరోవైపు సోషల్‌ సర్వీస్‌లోనూ పాలుపంచుకుంటూ, ఫిట్‌నెస్‌ పరంగా డెబ్యూ భామలకు సైతం గట్టి పోటీ ఇస్తూ, యాక్టివ్‌గా ఉంటోంది సమంత.

 

లేటెస్ట్‌గా 'మజిలీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి, ఎంతకాలంగానో హిట్‌ కోసం ఎదురు చూస్తున్న భర్త చైతూకి 'మజిలీ' రూపంలో మంచి హిట్‌ తెచ్చిపెట్టింది. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS