యూ టర్న్‌తో కథానాయిక ప్రధాన్యం ఉన్న సినిమాలవైపు దృష్టి సారించింది సమంత. అది చక్కటి ఫలితాన్ని అందిస్తోంది. యూ టర్న్‌తో పాటు ఆ తరవాత వచ్చిన ఓ బేబీ కూడా మంచి విజాయాన్ని అందించింది. ఇప్పుడు సమంత రెగ్యులర్ హీరోయిన్ పాత్రల్ని ఏమాత్రం ఇష్ట పడడం లేదు. తన దృష్టంతా లేడీ ఓరియెంటెడ్ పాత్రల వైపు ఉంది. తాజాగా అలాంటి మరో కథ ఓకే చేసినట్టు సమాచారం.
గీత గోవిందంతో ఓ సూపర్ హిట్ అందుకున్నాడు పరశురామ్. ఇప్పుడు నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఆ వెంటనే సమంతతో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నాడట పరశురామ్. నాయికా ప్రాధాన్యం ఉన్న కథంటే... బాధలు, బరువులు ఉంటాయనుకుంటారు. అయితే ఈ కథ ఆ టైపు కాదట. పూర్తి వినోదాత్మకంగా సాగుతుందట. ముందు చైతూ సినిమా, ఆ తరవాత సమంతతో సినిమా. పరశురామ్ జాక్ పాట్ కొట్టేసినట్టే.