క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పేరుతో ఓ క్లబ్ ని కొంతమంది సినీ తారలు ఏర్పాటు చేశారు. ప్రతీ యేటా ఓ రెండు రోజుల పాటు అందరూ కలుసుకుని, సరదాగా పండగ చేసుకోవడం ఓ అలవాటుగా వస్తోంది. ఈ క్లబ్ ఏర్పాటై ఇది పదో ఏడాది. అందుకే ఇంకొంచెం ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నారు. చిరంజీవి ఇంట్లో ఘనమైన పార్టీ జరిగింది. అందుకు సంబంధించిన చిత్రాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శని, ఆదివారాల పాటు సాగిన ఈ వేడుక.. ఉత్సాహవంతంగా జరిగిందని తెలుస్తోంది.
అయితే ఈ కార్యక్రమాని నాగార్జున, వెంకటేష్, మోహన్‌లాల్ లాంటి అగ్రతారలంతా హాజరయ్యారు. దక్షిణాదికి చెందిన కమల్ హాసన్, రజనీకాంత్ రాలేదు. బాలకృష్ణ, మోహన్‌బాబు లాంటి వాళ్లూ హాజరుకాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వీళ్లు కూడా వచ్చి ఉంటే.. ఈ కార్యక్రమం మరింత రంగుల హరివిల్లుగా జరిగేది. వచ్చే యేడాదైనా వీళ్లందరూ వస్తారేమో చూడాలి.