60 లక్షలు - సమంత మళ్లీ షాకిచ్చింది.!

By iQlikMovies - February 13, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ని పెంచుకోవడం ఓ కళ. హాట్‌ హాట్‌ ఫోటోలు మాత్రమే కాదు, ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే, సెలబ్రిటీలకు అభిమానులు పోటెత్తుతారు. అసలు విషయమేంటంటే, హీరోయిన్‌ సమంత ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కి ఫాలోవర్స్‌ 60 లక్షల మంది ఉన్నారు. తాజాగా 60లక్షలకు తన అభిమాన గణం రీచ్‌ అవ్వడాన్ని పురస్కరించుకుని సమంత కొన్ని ఫోటోల్ని షేర్‌ చేసింది. 

 

సమంత అంటేనే హాట్‌. పెళ్లయినా హాట్‌ అప్పీల్‌లో మాత్రం తేడా రాలేదు. ఎవ్వరేమనుకున్నా డోంట్‌ కేర్‌ అనే నైజం ఆమెది. అందం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని బలంగా నమ్మే సమంత ఈ లేటెస్ట్‌ ఫోటోలతో ఇంకోసారి నిరూపించింది. పెళ్లయ్యాక ఈ ఎక్స్‌పోజింగ్‌ ఏంటీ.? అని ప్రశ్నించేవారి సంగతెలా ఉన్నా, సమంత హాట్‌ లుక్‌కి ఫిదా అయ్యే అభిమానులు వందలు, వేలు, లక్షలు ఉంటూనే ఉంటారు. 

 

సమంత తాజా చిత్రం 'మజిలీ' త్వరలో విడుదల కాబోతోంది. వేలంటైన్స్‌ డే సందర్భంగా రేపు 'మజిలీ' టీజర్‌ రానుంది. రియల్‌ లైఫ్‌ పాట్నర్‌ అయిన నాగచైతన్య ఈ సినిమాలో సమంతకు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 'నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS