'మీటూ' కాంపెయినింగ్ అనేది ఇప్పుడో ఉద్యమంగా మారింది. చిత్రసీమలో లైంగిక వేధింపులకు గురైన ఆడవాళ్లంతా `మీటూ` వేదిక చేసుకుని గళం విప్పుతున్నారు. బాలీవుడ్ కథానాయిక తనుశ్రీ దత్తా నటుడు నానా పటేకర్‌పై చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
గాయని చిన్మయి కూడా తన లైంగిక వేధింపులపై నోరు విప్పడంతో `మీటూ` కాంపెయినింగ్‌కి మరింత ఊతం లభించినట్టైంది. అయితే బాలీవుడ్‌లో తనుశ్రీ దత్తాకి లభించిన మద్దతు.. ఇక్కడ చిన్మయికి దొరకలేదు. నటీనటులు ఎవరూ ఆమె వెంట నిలబడలేదు. ఇప్పుడు సమంత తొలిసారి నోరు విప్పింది. చిన్మయికి తన మద్దతు ప్రకటించింది. చిన్మయి వైపు నిలబడి, బాసటగా మాట్లాడిన మొదటి దక్షిణాది కథానాయిక సమంతనే. తాము ఎదుర్కున్న అనుభవాల్ని తొలిసారి నోరు విప్పి చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేసింది సమంత. ఇలా మాట్లాడడం వల్లే... తమలో తాము కుమిలిపోతున్న ఎంతో మంది చిన్నారులకు ధైర్యాన్ని ఇవ్వగలిగారని ట్వీట్ చేసింది సమంత.
ఈ కాంపెయినింగ్‌కి తాను మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించింది. సమంత - చిన్మయి మంచి స్నేహితులు. సమంతకు డబ్బింగ్ చెప్పేది చిన్మయే. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ కూడా సమంతకు దోస్త్. స్నేహితులకు మద్దతు తెలపడం స్నేహితురాలిగా సమంత ధర్మం. ఇప్పుడు అదే నిర్వర్తించింది.
సమంతని చూసి మరింత మంది కథానాయికలు మద్దతు తెలపడానికి ముందుకొస్తారేమో చూడాలి.