ఓటీటీల కాలమిది. అగ్ర కథానాయికలు సైతం వెబ్ సిరీస్‌లలో నటించడానికి మొగ్గు చూపిస్తున్నారు. సమంత కూడా ఓ వెబ్ సిరీస్ చేసేసింది అదే... ఫ్యామిలీ మెన్ 2. తొలి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో.. రెండో సీజన్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. సమంత రాకతో.. ఈ వెబ్ సిరీస్ కి మరింత ఆకర్షణ పెరిగింది. బుధవారం.. ఫ్యామిలీమెన్ 2కి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదలైంది.
సమంతని `రా`లుక్‌లో చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లోనూ పాలు పంచుకుంది సమంత. నాగచైతన్యకు సైతం... ఈ ట్రైలర్ తెగ నచ్చేసింది. అందుకే పదికి పదికి మార్కులేస్తూ... తన ట్విట్టర్‌లో ఈ ట్రైలర్ ని షేర్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది. మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ఈ వెబ్ సిరీస్ ని.. రాజ్ అండ్ డీకే తెరకెక్కించారు. జూన్‌లో అమేజాన్‌లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.