'బాల్యం చాలా విలువైనది. నా బాల్యం అంత సాఫీగా సాగలేదు. కాబట్టి, నాకు పుట్టబోయే పిల్లలకు బాల్యం తాలూకు అనుభూతులన్నీ ఆస్వాదించేలా చేస్తాను. నాకు నా భర్త, చైకి పిల్లల విషయంలో ఓ అండర్‌స్టాండింగ్ ఉంది' అంటూ ముచ్చటగా మాట్లాడుతోంది ఎవరో కాదు, అక్కినేని వారి కోడలు సమంత.
ఇటీవలే 'రామలక్ష్మి'గా రంగస్థలంలో ఆకట్టుకున్న సమంత, పిల్లలు పుట్టాక తానిక సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తాననే నేపథ్యంలో పై విధంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కెరీర్ దూకుడు మీదుంది. కెరీర్ ఎండ్ అయిపోతుందనగా, పిల్లల కోసం ప్లాన్ చేస్తుందట. ఈ విషయంలో నాగ చైతన్యకీ, సమంతకీ మధ్య ఓ లవ్‌లీ డీల్ కూడా సెట్ అయ్యిందట. అయితే అదంతా తన వ్యక్తిగతం అంటోంది. ఏది ఏమైనా పిల్లలు పుట్టాక మాత్రం మాతృత్వపు అనుభూతిని తాననుభవిస్తూ, బాల్యం తాలూకు అందమైన అనుభూతుల్ని తమ పిల్లలకు కూడా అందిస్తానని చెబుతోంది సమంత. తెలుగుతో పాటు, తమిళంలో కూడా బిజీ హీరోయిన్‌గా గడుపుతోంది సమంత.
'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత సమంతపై ఉన్న అభిమానం మరింత రెట్టింపైందనీ ఆమె అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే 'మహానటి' చిత్రంతో రాబోతోంది. అలాగే 'యూ టర్న్' తదితర చిత్రాలు సమంత చేతిలో ఉన్నాయి. సినిమా సంగతిలా ఉంచితే, పర్సనల్ లైఫ్ ముఖ్యంగా పిల్లల విషయంలో సమంత చెబుతున్న మాటలు వింటుంటే, నిజంగానే ముచ్చటేసుకొస్తోంది. దటీజ్ సమంత.