ఉత్తేజ్ డాన్స్ అకాడమీ షురు

మరిన్ని వార్తలు

ప్ర‌ముఖ న‌టుడు ఉత్తేజ్ బుధ‌వారం హైద‌రాబాద్ ఎల్లారెడ్డి గూడ‌లో ``మ‌యూఖ`` ( ఎరెనా ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్స్ట్) డ్యాన్స్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా, ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ తో పాటు జ‌బ‌ర్ధ‌స్త్ షో టీవీ న‌టులు పాల్గొన్నారు. కూచిపూడి డ్యాన్స్, వెస్ర్ట‌న్ డ్యాన్స్, యోగా, జుంబా, క‌ర్ణాటిక్ మ్యూజిక్ కు సంబంధించి క్లాస్ లు నిర్వ‌హిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఉత్తేజ్ మాట్లాడుతూ, `కూచిపూడి డ్యాన్స్, వెస్ర్ట‌న్ డ్యాన్స్, యోగా, జూంబా, క‌ర్ణాటిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. చాలా ఫ్యాష‌నేట్ గా ఇనిస్ట్యూట్ పెట్టాను. శ్రీకాంత్ అన్న‌య్య చేతుల మీదుగా లాంచ్ అవ్వ‌డం చాలా ఆనందం గా ఉంది. ఉద‌యం, సాయంత్రం సెష‌న్స్ ఉంటాయి. యాక్టింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 6 గంట‌ల నుంచి 7 గంట‌ల‌ వ‌ర‌కూ యోగా త‌ర్వాత వెస్ర్ట‌న్, జింబా, సాయంత్రం క‌ర్ణాట‌క మ్యూజిక్ క్లాస్ లు ఉంటాయి` అని అన్నారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ, `ఉత్తేజ్ చాలా సంవత్స‌రాల నుంచి స్నేహితుడు. ట్యాలెంటెడ్ న‌టుడు. త‌ను ఇనిస్ట్యూట్ స్థాపించ‌డం గ‌ర్వంగా ఉంది. క‌చ్చితంగా స‌క్సెస్ అవుతుంది. చాలా ప్రెస్టీజియ‌స్ గా డ్యాన్స్ స్కూల్ స్థాపించాడు. అలాగే యాక్టింగ్ కూడా పెడిగే బాగుంటుంది. చాలా సిన్సియ‌ర్ గా క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తాడు. డ్యాన్స్, యాక్టింగ్, ప‌ట్ల ఫ్యాష‌న్ ఉన్న వాళ్లంతా ఇక్క‌డ‌కు వ‌చ్చి నేర్చుకుంటే శిక్ష‌ణ‌లో ఆరితేరుతారు. అందులో ఎలాంటి డౌట్ లేదు` అని అన్నారు.

శివాజీ రాజా,`ఉత్తేజ్ 30 ఏళ్ల నుంచి స్నేహితుడు. ఈరోజు త‌ను డాన్స్ స్కూల్ పెట్ట‌టం చాలా సంతోషంగా ఉంది. రెండు రాష్ర్టాల‌కు చెందిన ఆస‌క్తిగ‌ల పిల్ల‌లంతా ఒక్కడ నేర్చుకుంటే బాగుంటుంది. స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ, ``మ‌యూఖ` యాక్టింగ్, డ్యాన్స్ స్కూల్ పేరు బాగుంది. ఉత్తేజ్ ప్ర‌తిభావంతులు. ఎంతో అనుభ‌వం గ‌ల‌వారు. ఆయ‌న ఇనిస్ట్యూట్ ప్రారంభించ‌డం చాలా సంతోషంగా ఉంది. స్కూల్ లో మంచి టీమ్ ఉంది. డ్యాన్స్, న‌ట‌న ప‌ట్ల ఆస‌క్తిక‌గల వారంతా ఇక్క‌డ శిక్ష‌ణ తీసుకుంటే బాగుంటుంది. మంచి డ్యాన్స‌ర్ల‌గా ఎదుగ‌తారు. స్కూల్ స‌క్సెస్ ఫుల్ గా రన్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా` అని అన్నారు.

- ప్రెస్ రిలీజ్

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS