అన్నా చెల్లెళ్ల ఫైట్‌ ఆ రోజే.!

మరిన్ని వార్తలు

సెప్టెంబర్‌ 13న సమంత నటిస్తున్న 'యూ టర్న్‌' సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే రోజు సుధీర్‌బాబు నటిస్తున్న 'నన్ను దోచుకుందువటే' సినిమా కూడా విడుదల కానుంది. అయితే వీరిద్దరి మధ్యా అన్నా చెల్లెళ్ల సంబంధం ఉందన్న సంగతి మర్చిపోయారా? అదేనండీ 'ఏ మాయ చేశావె' సినిమాలో వీరిద్దరూ అన్నా చెల్లెళ్లుగా నటించారు గుర్తుంది కదా. ఇద్దరికీ ఇదే తొలి చిత్రం కూడా. 

లేటెస్టుగా సమంత నటించిన 'యూ టర్న్‌' చిత్రం ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ట్రైలర్‌పై సుధీర్‌బాబు సోషల్‌ మీడియా ద్వారా స్పందించాడు. 'ఏళ్లు గడుస్తున్నాయి. జెస్సీ, జెర్రీ ఫైట్‌ అలాగే కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 13న ఈ అన్నాచెల్లెళ్ల ఫైట్‌ జరగబోతోంది. సమంత 'యూ టర్న్‌' ట్రైలర్‌ చాలా బాగుంది..' అని స్పందించాడు. అందుకు సమంత, నాట్‌ ఏ ఫైట్‌. ఇద్దరి సినిమాలు మంచి విజయం సాధించాలని సుధీర్‌బాబు సినిమాకి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. 

మరోవైపు సమంత మామ నాగార్జున కూడా స్పందించాడు. ఖచ్చితంగా సర్‌ప్రైజ్‌ ఇస్తావ్‌ కోడలా అని ట్వీట్‌ చేశారు. టీమ్‌ మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. సమంత భర్త చైతూ కూడా యూటర్న్‌ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

 

ఇక సమంత అభిమానుల ట్వీట్స్‌తో సోషల్‌ మీడియా హోరెత్తి పోతోంది. కన్నడ సూపర్‌ హిట్‌ మూవీకి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది 'యూ టర్న్‌' చిత్రం. ఆది పినిశెట్టి, రాహుల్‌ రవీంద్రన్‌, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS