ఇన్వెస్టిగేషన్‌ పూర్తి చేసిన సమంత.!

మరిన్ని వార్తలు

అక్కినేని వారి కోడలయ్యాక సమంత ఎంచుకుంటున్న సినిమాలు, ఆయా సినిమాల్లో ఆమె పాత్రలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అన్నీ వైవిధ్యభరితమైన హుందా అయిన పాత్రలనే ఎంచుకుంటోంది. ఇటీవల 'రంగస్థలం', 'మహానటి', 'అభిమన్యుడు' చిత్రాలతో హ్యాట్రిక్‌ అందుకున్న సమంత త్వరలోనే మరో హిట్‌నీ తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయిపోతోంది. 

కన్నడలో ఘన విజయం సాధించిన 'యూటర్న్‌' తెలుగు రీమేక్‌లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సమంత డిఫరెంట్‌ లుక్‌లో కనిపించబోతోంది. ఓ హత్యకేసును ఇన్వెస్టిగేట్‌ చేసే జర్నలిస్ట్‌ పాత్రలో సమంత కనిపిస్తోంది. యంగ్‌ హీరో ఆది పినిశెట్టి, అదే కేసును ఛేదించే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఉన్నతాధికారి పాత్ర పోషిస్తున్నాడు. జర్నీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం సస్పెన్స్‌, థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. జర్నలిస్ట్‌గా సమంత, పోలీస్‌ ఆఫీసర్‌గా ఆది పినిశెట్టి పాత్రలు ఆధ్యంతం ఆశక్తిగా నడుస్తాయి. ఒరిజినల్‌ని రూపొందించిన పవన్‌ కుమార్‌ ఈ రీమేక్‌నీ తెరకెక్కిస్తున్నారు. 

దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఇవే కాక సమంత మరిన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. భర్త నాగచైతన్యతో 'నిన్ను కోరి' డైరెక్టర్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ రొమాంటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌లో నటిస్తోంది సమంత. అలాగే తమిళంలోనూ రీసెంట్‌గా రెండు క్రేజీ ప్రాజెక్టులపై సైన్‌ చేసింది. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌కి ఏమాత్రం బ్రేక్‌ లేకుండా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతూ, రాకెట్‌ స్పీడుతో దూస్కెళ్లిపోతున్న సమంతకు నిజంగా హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే మరి.!
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS