మలయాళంలో సన్నీ శృంగార లీలలు.!

మరిన్ని వార్తలు

పోర్న్‌ రంగం నుండి వచ్చి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా పాపులర్‌ అయిన ముద్దుగుమ్మ సన్నీలియోన్‌. ఈ మధ్యనే సౌత్‌ సినిమాలపై కూడా సన్నీ దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆల్రెడీ ఇటీవల తెలుగులో 'గరుడవేగ' చిత్రంలో ఐటెం సాంగ్‌లో నటించి, దుమ్ము రేపింది. తర్వాత పూర్తి స్థాయి హీరోయిన్‌గా 'వీరమహాదేవి' చిత్రంలో నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

 

కాగా లేటెస్టుగా సన్నీ మలయాళంలోకీ అడుగుపెట్టబోతోందట. కన్నుగీటి రాత్రికి రాత్రే పాపులర్‌ అయిపోయిన కొంటెపాప ప్రియా వారియర్‌ గుర్తింది కదా. 'ఒరు అధార్‌ లవ్‌' చిత్రంతో ఆ ప్రియావారియర్‌ని మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన డైరెక్టర్‌ ఒమర్‌ లులు ఇప్పుడు సన్నీలియోన్‌ని కూడా మలయాళ చిత్ర సీమకు పరిచయం చేసే యోచనలో ఉన్నారట. ఈయన దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతోన్న ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌లో సన్నీలియోన్‌ని ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ కోసం ఎంచుకోనున్నారనీ తెలుస్తోంది. 

ఆ సినిమాలో నటించేందుకు సన్నీలియోన్‌ కూడా సుముఖంగా ఉందట. అయితే ఈ సినిమాలో సన్నీలియోన్‌ కామెడీ పండిస్తుందా? హాట్‌ అప్పీల్‌ ఇస్తుందా? అనేది చూడాలి మరి. ఈ మధ్యనే 'కరణ్‌జీత్‌కౌర్‌' అంటూ సన్నీ తన బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల టైంలో వివాదాలు తలెత్తినా, ఇది వెబ్‌ సిరీస్‌ కాబట్టి, ఆ వివాదాలు పెద్దగా వెలుగులోకి రాలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ బయోపిక్‌ విడుదలైంది. 

చూస్తుంటూ పోతే, మొత్తానికి సౌత్‌లో క్రమక్రమంగా సన్నీలియోన్‌ తన హవా పెంచుకుంటోందనే చెప్పాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS