ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్‌తో.. సమంతకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్‌లో రాజీ పాత్ర.. చాలామందికి చేరువైంది. సమంత ఎలాంటి పాత్ర అయినా చేయగలదు అనే నమ్మకాన్ని ఈ వెబ్ సిరీస్ కల్పించింది. బాలీవుడ్ లో సమంత పేరు గట్టిగా వినిపించడానికి కారణం ఇదే. ఆ తరవాత సమంతకు చాలా ఆఫర్లు వచ్చాయి. వెబ్ సిరీస్‌లు చేయమని నిర్మాతలు వెంట పడ్డారు. కానీ.. సమంత కనికరించలేదు. కానీ.. రాజ్‌డీకే ద్వయానికి సమంత మళ్లీ పడిపోయింది.
ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్‌తో రాజ్‌డీకే దర్శకత్వ ప్రతిభ ఏమిటో అందరికీ అర్థమైపోయింది. వెబ్ సిరీస్ చేయాలంటే వాళ్ల తరవాతే ఎవరైనా అన్నంత పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్లే సమంత కోసం ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నార్ట. ఈ కథ సమంతకు నచ్చిందని, వెంటనే ఈ వెబ్ సిరీస్‌లో నటించడానికి ఒప్పుకుందని సమాచారం అందుతోంది. సమంత వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు పుష్సతో ఐటెమ్ సాంగులూ చేస్తానని ప్రకటించింది. ఇంత బిజీ షెడ్యూల్ లో ఈ వెబ్ సిరీస్ కి డేట్లు ఎలా సర్దుబాటు చేస్తుందన్నదే పెద్ద ప్రశ్న.