ఈమధ్య స్టార్లంతా ఓటీటీలవైపు చూస్తున్నారు. పారితోషికాలు భారీగా వస్తుండడం, ఓటీటీ అంటే క్రేజ్ ఉండడంతో.. వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఏమాత్రం మొహమాట పడడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే సినిమాలకంటే.. వెబ్ సిరీస్‌లతోనే మైలేజీ ఎక్కువ వస్తుందని నమ్ముతున్నారు. తమన్నా, శ్రతిహాసన్ లాంటి స్టార్లు ఓటీటీ బాట పట్టిన వాళ్లే. అయితే... వీళ్లకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వీరిద్దరి తొలి ప్రయత్నాలు ఘోరంగా విఫలం అయ్యాయి. తమన్నా `లెవెన్త్ అవర్` అనే వెబ్ సినీస్ చేసింది.
ఆహాలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోగా... వ్యూస్ పరంగానూ తేలిపోయింది. తమన్నా ఉన్నప్పటికీ ఈ సిరీస్ ని చూడ్డానికి తెలుగు ప్రేక్షకులకు మొగ్గు చూపలేదు. శ్రుతి నటించిన `పిట్ట కథలు` అనే వెబ్ మూవీ కూడా నిరాదరణకు గురైంది. ఇక సమంత `ఫ్యామిలీ మెన్ 2` సిరీస్ ఏమవుతుందో? అది కూడా ఫట్టుమంటే... స్టార్ హీరోయిన్లు ఇటు వైపు చూడ్డానికి భయపడతారేమో..?