గత కొన్ని నెలలుగా సినిమా షూటింగులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే నెమ్మదిగా కొత్త సినిమాలు లాంచ్ చేస్తున్నారు, షూటింగులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నిర్మాత KK రాధామోహన్ శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబోయే సినిమాను ఈరోజు లాంచ్ చేశారు. ఈ సినిమాతో అశోక్ తేజ అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.
అశోక్ తేజ గతంలో సంపత్ నంది దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేశారు. ఈ సినిమాకు కూడా సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతుందట. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలోని నటీనటులు, ఇతర టెక్నీషియన్ల వివరాలను వెల్లడిస్తారు.
వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగును ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో అశోక్ తేజ ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పిస్తాడు, గురువును మించిన శిష్యుడు అనిపించుకుంటాడా? అనేది వేచి చూడాలి.