ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్.... ఇలాంటి విజయవంతమైన చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు సంపత్‌నంది. ఇప్పుడు గోపీచంద్‌తో `సిటీమార్` తెరకెక్కిస్తున్నాడు. ఎప్పటికైనా పవన్ కల్యాణ్‌తో సినిమా చేయాలన్నది సంపత్ కల. ఇది వరకు ఓ సారి ఆ అవకాశం అందినట్టే అంది చేజారింది. `సర్దార్ గబ్బర్ సింగ్` ప్రాజెక్టుకు ముందు అనుకున్న దర్శకుడు సంపత్ నందినే. ఆ తరవాత అది బాబీ చేతికి వెళ్లింది. అప్పటి నుంచీ పవన్ తో సినిమా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు సంపత్.
ఇప్పుడు కూడా వపన్ కోసం ఓ కథ రాసుకున్నాడట. అది త్వరలోనే వినిపిస్తానని అంటున్నాడు. అంతేకాదు.. చిరంజీవితో ఓ సినిమా చేయాలన్న కోరికను వ్యక్తం చేశాడు సంపత్ నంది. రాజాకార్ల నేపథ్యంలో ఓ కథ తయారు చేశాడట. అది త్వరలోనే చిరంజీవికి వినిపిస్తానంటున్నాడు. అటు చిరు, ఇటు పవన్.. ఇద్దరూ సినిమాల విషయంలో జోరు మీదే ఉన్నారు. నవతరం దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సంపత్‌నంది కి కూడా త్వరలోనే మెగా ఆఫర్ వస్తే.. ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.