ఇటీవల హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఘటన మరువక ముందే అలాంటి మరో వార్త వినాల్సివస్తోంది. ప్రముఖ హాస్యనటుడు సంపూర్ఱేష్ బాబు ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సిద్ది పేట బస్టాండ్ దగ్గర ఈ ప్రమాదం సంభవించింది. తన కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న సంపూ కారుని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంపూతో పాటు అతని భార్య, కూతురికి స్వల్ప గాయాలు అయ్యాయి.
వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి ఈ ముగ్గురినీ తరలించినట్టు తెలుస్తోంది. గాయాలు చిన్నవే అని, కంగారు పడాల్సిన అవసరం లేదని సంపూ సన్నిహితులు తెలిపారు. ఇటీవలే కొబ్బరి మట్ట సినిమాతో అలరించాడు సంపూ. తను కథానాయకుడిగా మరిన్ని సినిమాలు తెరపైకి రానున్నాయి.