కౌశ‌ల్ అలా అన‌కుండా ఉండాల్సింది!

By iQlikMovies - October 06, 2018 - 09:52 AM IST

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ 2లో అత్యంత ర‌స‌వ‌త్త‌ర‌, వివాదాస్ప‌ద ఘ‌ట్టం ఏమైనా ఉందీ అంటే.. అది `కుక్క‌` ఎపిసోడే!  `అంద‌రూ నాపై కుక్క‌ల్లా మీద ప‌డుతున్నారు` అని కౌశ‌ల్ ఓ సంద‌ర్భంలో నోరు జారేస‌రికి - మిగిలిన కంటెస్టెంట్స్ అంతా.... కౌశ‌ల్‌పై విరుచుకుప‌డ్డారు. ఈ వివాదం సోష‌ల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యింది. 

కౌశ‌ల్‌పై వ‌చ్చిన పాజివిటీ, సాఫ్ట్ కార్న‌ర్ మొత్తం ఈ ఒక్క డైలాగ్‌తో పోతుందేమో అనిపించింది. ఎప్పుడూ కామ్‌గా ఉండే సామ్రాట్ సైతం కౌశ‌ల్‌పై కోపంతో ఊగిపోయాడు. రోల్ రైడా అయితే ఏడ్చేశాడు. గీతామాధురి అయితే ఇక చెప్ప‌క్క‌ర్లెద్దు. ఆ త‌ర‌వాత కౌశ‌ల్ సారీ చెప్పినా - బిగ్ బాస్ 2 క్లైమాక్స్ మొత్తం ఆ ఒక్క మాట చుట్టూనే తిరిగింది. ఇప్పుడు ఆ ఘ‌ట‌న మ‌రోసారి గుర్తు చేసుకున్నాడు సామ్రాట్‌.

ఓ ఇంట‌ర్వ్యూలో 'తేజ‌స్వి కూడా ఓసారి కుక్క అన్న‌ది క‌దా.. అప్పుడు రియాక్ట్ కాని మీరు కౌశ‌ల్ కుక్క అనేస‌రికి ఎందుకు అంత‌గా స్పందించాల్సివ‌చ్చింది' అని అడిగితే.. ''తేజ‌స్వి కుక్క అన్న సంగ‌తి నాకు గుర్తు లేదు. సిగ్గు లేకుండా తింటున్నారు అని మాత్ర‌మే అన్న‌ది. కౌశ‌ల్ విష‌యానికొస్తే అన్ని రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ప్ర‌యాణం చేశాక‌..  కౌశ‌ల్ కుక్క అనేస‌రికి నేను ప‌ర్స‌న‌ల్‌గా తీసుకోవాల్సివ‌చ్చింది.

 

ఇన్నేళ్ల నా జీవితంలో ఎవ్వ‌రూ ఆ మాట‌వాడ‌లేదు. ఒక‌రిమీద కోపంతో అంద‌రినీ అనేస‌రికి... బాధేసింది. ఆ త‌ర‌వాత కౌశ‌ల్ సారీ చెప్పాడు. అయినా అలా అన‌కుండా ఉండాల్సింది'' అని బిగ్ బాస్ హౌస్‌లో జ‌రిగిన విష‌యాల్ని గుర్తు చేసుకున్నాడు సామ్రాట్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS