ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినీ ప్రపంచంలో సత్తా చాటిన వ్యక్తి కాంతారావు. కాంతారావు కత్తి పైటింగులకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది అప్పట్లో. అయితే కొన్ని కారణాలతో కాంతారావు కెరీర్ డల్ అవుతూ వచ్చింది. సినీ పరిశ్రమలో ఎంత సంపాదించారో ఆ సంపాదించిందంతా సినీ పరిశ్రమకే వ్యత్యించారాయన.
కానీ చివరి రోజుల్లో కాంతారావును పట్టించుకునే వారే కరువయ్యారు. సినీ పరిశ్రమ నుండి తగిన గౌరవం దక్కలేదు ఆయనకు. కుట్ర పూరితంగా కొందరు ఆయన్ని తొక్కేశారు అని కాంతారావు అభిమానులు అంటుంటారు. కాంతారావు జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని చాలా ముఖ్యమైన విషయాలు అయన బయోపిక్‌లో చూడబోతున్నామట. సీనియర్ దర్శకుడు వి.సి.ఆదిత్య ఈ బయోపిక్‌ని రూపొందిస్తున్నారు.
ఆల్రెడీ టైటిల్ సాంగ్ రూపొందించి యూ ట్యూబ్‌లో విడుదల చేశారట. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా సినీ పరిశ్రమలో బయోపిక్స్ హవా కొనసాగుతోంది. ఈ తరుణంలో కాంతారావు బయోపిక్ ఎలాంటి ఆదరణ దక్కించుకోనుందో. అందులోనూ కాంతారావు జీవితంలోని చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విశేషాలున్నాయట.
వాటిన ప్రధానంగా ఈ బయోపిక్‌లో హైలైట్ చేయనున్నామని చిత్ర యూనిట్ ముందుగానే సంకేతాలు ఇవ్వడంతో ఈ బయోపిక్‌పై ఆశక్తి మరింతగా పెరుగుతోంది.