'అప్పుడేదో తెలియక ఎక్స్‌పోజింగ్ చేసేశా.. దయచేసి వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయొద్దు ప్లీజ్..' అంటూ పలువురు అందాల భామలు సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్న వైనం ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతోంది. కొన్నాళ్ళ క్రితం ఓ హీరోయిన్, 'బొడ్డు మీద కొబ్బరికాయ పెడితే, అదేం హాట్ అప్పీల్ అవుతుందో నాకు అర్థం కావడంలేదు..' అని ఆ సీన్‌లో నటించేసిన చాన్నాళ్ళ తర్వాత ఓవరాక్షన్ చేసింది.
మొన్నీమధ్యనే ఓ హీరోయిన్, 'నా బొడ్డు ప్రాంతాన్నే ఎందుకు చూస్తారో నాకు అర్థం కావడంలేదు..' అంటూ అమాయకంగా ప్రశ్నించేసింది. ఇలా వుంటే, 'కత్తి'లాంటి హీరోయిన్ సనా ఖాన్, సినిమా రంగాన్ని వదిలేసి, ఈ క్రమంలో తన గ్లామరస్ ఫొటోల్ని, వీడియోల్నీ ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ అభ్యర్థించడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. తాజాగా మరో భామ కూడా ఇదే తరహా విజ్ఞప్తి చేసింది.
ఒక్కసారి సోషల్ మీడియాకి ఎక్కాక.. వాటిని ఆపడం సాధ్యమయ్యే పని కాదు. పైగా, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ పుణ్యమా అని హద్దులు దాటిన ఎక్స్‌పోజింగ్ చేసేస్తున్నారు అందాల భామలు. సీ-గ్రేడ్ సెక్స్ సినిమాలు కూడా చేసేస్తున్న బ్యూటీస్‌ని చూస్తున్నాం. వాటి ద్వారా పేరు తెచ్చుకుని, కొన్నాళ్ళ తర్వాత, 'తూచ్' అనేస్తే ఎలా కుదురుతుంది.? ఇదో టైపు పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలో ఏమో.!