మంచు విష్ణు - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో `ఢీ` వచ్చి పదమూడేళ్లు అయ్యింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా `డి అండ్ డి` రూపొందుతోంది. `డబుల్ డోస్` అనేది క్యాప్షన్. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేశారన్న విషయం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఫిల్మ్ నగర్ లో మాత్రం చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో కథానాయికగా ప్రగ్యా జైస్వాల్ ని ఎంచుకునే అవకాశం ఉందని టాక్. అనూ ఇమ్మానియేల్ పేరు కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
ఇద్దరి కాల్షీట్లలో ఎవరివి అందుబాటులో ఉంటే... వాళ్లని కథానాయికగా ఖరారు చేస్తారు. మరోవైపు ఈ సినిమాలో జెనీలియా కూడా కనిపించనుందని ప్రచారం సాగుతోంది. `ఢీ`లో జెనీలియా కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. పెళ్లయ్యాక సినిమాలకు పూర్తిగా దూరమైంది జెనీలియా. ఇప్పుడు ఈ సినిమాతో రీ ఎంట్రీ చేయాలనుకుంటోందట. ఈసారి ఆమెది అతిథి పాత్రే అని తేలింది. జెనీలియా గనుక ఎంట్రీ ఇస్తే.. ఢీ సీక్వెల్ కి మరింత ఆకర్షణ వచ్చినట్టే.