దిక్కులు చూడకుండా, నన్నే చూడు.. నా అందాలే చూడు.. అంటూ హింట్ ఇస్తోంది ముద్దుగుమ్మ సనా మక్బూల్. అసలింతకీ ఎవరీ సనా మక్బూల్ అనుకుంటున్నారా.? అప్పుడెప్పుడో అజయ్, నాగశౌర్య, సీనియర్ నటి ఇంద్రజ కాంబినేషన్లో ఓ సినిమా వచ్చింది గుర్తుందా.? అదే 'దిక్కులు చూడకు రామయ్యా'. ఆ సినిమాలో తండ్రీ కొడుకులిద్దర్నీ లవ్లో దించేసి, తన అందాలతో తట పటాయించిన ముద్దుగుమ్మ గుర్తుండే ఉంటుంది కదా. ఆ ముద్దుగుమ్మే ఇదిగో ఇప్పుడిలా ఇసుక తిన్నెల్లో అందాలారేసిన ఈ ముద్దుగుమ్మ.
పింక్ హాట్ బికినీలో చేతులు రెండూ నేలకు ఆనించి, కూర్చొని సైడ్ యాంగిల్లో ఫోటోకి పోజిచ్చింది. దిక్కులు చూడకుండా, నా అందాలపైనే దృష్టి పెట్టండి అన్నట్లుంది అమ్మడి పోజు. దూరంగా సముద్రపు అలలు, కింద నుండి ఇసు రేణువుల గిలిగింతలు.. మధ్యలో అమ్మడి అందాల తళుకు బెళుకులు.. నేలనీ, నింగినీ కలిపేస్తున్నాయా అమ్మడి అందాలు అన్నట్లు పిక్ కాన్సెప్ట్ పోలా..అదిరిపోలా..!