అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ అక్కడ ఫిక్సయినట్లేనా!

By Inkmantra - October 10, 2019 - 12:20 PM IST

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' సినిమాతో తెలుగులో సంచలన విజయం అందుకున్నాడు డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. తర్వాత అదే సినిమాని హిందీలో 'కబీర్‌ సింగ్‌' అనే పేరుతో రీమేక్‌ చేశాడు. అక్కడ కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టింది ఈ సినిమా. దాంతో సందీప్‌ రెడ్డిలో ఎక్కడ లేని కాన్ఫిడెన్స్‌ వచ్చేసింది. తన మూడో చిత్రం కూడా బాలీవుడ్‌లోనే తెరకెక్కించాలని డిసైడ్‌ అయిపోయాడు. అయితే, అది నెక్స్‌ట్‌ లెవల్‌లో రూపొందించాలనుకున్నాడు. అంటే ప్యాన్‌ ఇండియన్‌ మూవీగా అన్న మాట. అందుకోసం ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ని చూజ్‌ చేసుకున్నాడు.

 

త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించనున్నాడట. అన్నట్లు ఈ సినిమాతో మన డేరింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా నిర్మాతగా కూడా మారబోతున్నాడు. 'కబీర్‌ సింగ్‌' సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించిన భూషణ్‌ కుమార్‌, మురాద్‌ కేతానిలతో కలిసి ఈ కొత్త ప్రాజెక్టును స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు సందీప్‌ రెడ్డి వంగా. ఇదిలా ఉంటే, రెండో సినిమాకే తెలుగులో మహేష్‌బాబు తో సినిమా తెరకెక్కించే ఛాన్స్‌ కొట్టేశాడు సందీప్‌ రెడ్డి వంగా.

 

అయితే, అప్పటికే మహేష్‌ - అనిల్‌ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాకి కమిట్‌ అవ్వడంతో, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్‌ అలా హోల్డ్‌లో పడింది. కానీ, మహేష్‌తో తన సినిమా పక్కా అని పలు సందర్భాల్లో సందీప్‌ రెడ్డి వంగా ఓపెన్‌గానే చెప్పాడు. ఇప్పుడు ప్యాన్‌ ఇండియన్‌ మూవీతో సందీప్‌ రెడ్డి వంగా బిజీ అయిపోనున్నాడు. మరి మహేష్‌తో సినిమా ఇంకెప్పుడు చేస్తాడో చూడాలిక. ఇదిలా ఉంటే, కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించి సందీప్‌ రెడ్డి వంగా ఇంకా నటీనటుల పేర్లని అనౌన్స్‌ చేయలేదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS