సందీప్‌ ఈసారి క్రైమ్‌ థ్రిల్లర్‌తో?

మరిన్ని వార్తలు

'అర్జున్‌ రెడ్డి' సినిమాతో ఆడియన్స్‌ దృష్టినే కాదు, టోటల్‌ తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా. సంచలనాత్మక విజయాన్ని అందుకున్నాడు ఈ యంగ్‌ డైరెక్టర్‌ 'అర్జున్‌రెడ్డి' సినిమాతో. అయితే తన తదుపరి సినిమా ఏంటో ఇంకా కన్‌ఫామ్‌ కాలేదు. అయితే ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌తో సందీప్‌ రెడ్డి తన రెండో సినిమాని తెరకెక్కించబోతున్నాడనీ తెలిసింది. 

ఈ సినిమాకి సంబంధించి, స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నాడట సందీప్‌ రెడ్డి. ఈ సినిమాని నిర్మించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ముందుకొచ్చిందట. సక్సెస్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఓ బిగ్‌ బ్యానర్‌లో ఈ సినిమా నిర్మితం కానుందనీ సమాచారమ్‌. అంతేకాదు ఈ సినిమాని ప్రయోగాత్మకంగా భావించి రూపొందిస్తోందట ఈ నిర్మాణ సంస్థ. అంతే కాదు ఇందుకోసం ఆ బ్యానర్‌ నుండి ఇంకో కొత్త బ్యానర్‌ రూపొందనుందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌. 

మాతృ సమర్పణలో, కొత్త సంస్థ నిర్మాణంలో ఈ సినిమా రూపొందనుందట. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో పాపులర్‌ అయిన సందీప్‌ రెడ్డి ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు సందీప్‌. క్రైమ్‌ థ్రిల్లర్స్‌ హవా బాగా నడుస్తోందిప్పుడు. ఆ కోణంలో ఓ సరికొత్త స్టోరీ లైన్‌ని సిద్ధం చేస్తున్నారట సందీప్‌. 'అర్జున్‌రెడ్డి' తరహాలోనే ఈ సినిమాతో మరోసారి సంచలనాత్మక విజయాన్ని అందుకునే దిశగానే అడుగులు కదుపుతున్నాడనీ సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS