సందీప్ వంగా కూడా సై అంటున్నాడా?

మరిన్ని వార్తలు

ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఓటీటీలకు ఆదరణ పెరిగింది అన్నది వాస్తవం. మరి కొన్ని నెలల పాటు థియేటర్ల పరిస్థితి ఏంటో అర్థం కాకుండానే ఉంది. ఒకవేళ థియేటర్లు ఓపెన్ చేసినప్పటికీ థియేటర్లకు సరిపడా సినిమాలు మాత్రం సెట్లపై లేవు. నటీనటులు షూటింగులకు హాజరు కావడానికి విముఖత చూపుతూ ఉండడంతో ఫిలిమ్ మేకర్లందరూ షూటింగులు వాయిదా వేసుకున్నారు. దీంతో పలువురు దర్శకనిర్మాతలు ఈ ఖాళీ సమయంలో ఓటీటీ వేదికలకు కంటెంట్ రెడీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

 

ఇప్పటికే ఈ దిశగా మారుతి, పూరి జగన్నాథ్ లాంటి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ ఉంది. తాజాగా ఈ బాటలో సంచలన దర్శకుడు సందీప్ వంగా కూడా చేరారని సమాచారం. 'కబీర్ సింగ్' తర్వాత సందీప్ కొత్త సినిమా ఇంకా ఫిక్స్ కాలేదు. ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు మరికొంత సమయం పడుతుందని టాక్ ఉంది. దీంతో ఆ సినిమా ప్రారంభం అయ్యే లోపు ఒక వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాలని సందీప్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జోరుగా సాగుతోందని అంటున్నారు.

 

త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాది చివరి వరకు పట్టాలెక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి అప్పట్లోపే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ లో హీరోహీరోయిన్లుగా ఎవరికీ అవకాశం దక్కుతుందో వేచి చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS