'అధీరా' మరీ భయపెట్టేస్తున్నాడుగా!

By iQlikMovies - July 29, 2019 - 12:30 PM IST

మరిన్ని వార్తలు

ఎవరీ 'అధీరా' అనుకుంటున్నారా.? రెండో 'కేజీఎఫ్‌' విలన్‌. ఇంతకీ ఈ విలన్‌ ఎవరనుకుంటున్నారా.? బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌దత్‌. కన్నడ సంచలనం 'కేజీఎఫ్‌'కి సౌత్‌లోనే కాకుండా, నార్త్‌లో కూడా బీభత్సమైన క్రేజ్‌ దక్కిన సంగతి తెలిసిందే. ఆ క్రేజ్‌ చల్లారకుండానే 'కేజీఎఫ్‌' టీమ్‌ రెండో 'కేజీఎఫ్‌'నీ సిద్ధం చేసేస్తోంది. ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

అయితే, తాజాగా ఈ సినిమాలో 'అధీరా' అనే పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఇంతకీ ఈ పాత్ర పోషిస్తున్నదెవరో అర్ధమయ్యే ఉంటుంది కదా. ఆయనే సంజయ్‌దత్‌. కోలార్‌ గోల్డ్‌ మైన్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'కేజీఎఫ్‌' సృష్టించిన సెన్సేషన్‌కి రెండో భాగాన్ని మరింత భారీగా తెరకెక్కించబోతున్నారన్న సంగతి తెలిసిందే. బడ్జెట్‌ పరంగా, కాస్టింగ్‌ పరంగా ఎక్కడా రాజీ పడడం లేదట. ఆ దిశగా బాలీవుడ్‌ నుండి సంజయ్‌దత్‌ని ఈ సినిమా కోసం విలన్‌గా ఎంచుకున్నారు.

 

ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్‌. గుబురు గెడ్డం, జులపాల జుట్టు, తీక్షణమైన చూపులతో సంజయ్‌దత్‌ని హీరోగానే కాదు, విలన్‌గానూ ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు. గతంలో హృతిక్‌ రోషన్‌ - కరణ్‌ కాంబో మూవీలో విలన్‌గా నటించిన అనుభవం కూడా సంజయ్‌దత్‌కి ఉంది. సో ఆ అనుభవంతో, 'కేజీఎఫ్‌ 2'లో అంతకు మించిన విలనిజం ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, తాజా ఫస్ట్‌లుక్‌లో సంజయ్‌దత్‌ ముఖాన్ని ముసుగుతో కవర్‌ చేసి చూపించి, మరింత ఆసక్తి పెంచేశారు. యష్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS