విడుదలకి ముందే రికార్డు సృష్టించిన సంజు

By iQlikMovies - June 28, 2018 - 13:02 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన చిత్రం సంజు. ఈ చిత్రంలో సంజయ్ పాత్రని ప్రముఖ హీరో రణబీర్ కపూర్ పోషిస్తున్న సంగతి విదితమే, ఇక ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

అయితే ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు ఒకే బాషలో విడుదలయ్యే చిత్రాన్ని ఇంత పెద్ద ఎత్తున విడుదల చేయనుండడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టగా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పేరిట కూడా ఈ సినిమా కలెక్షన్స్ సునామి సృష్టించనుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో ప్రధాన తారాగణం రూపంలో పరేష్ రావల్, మనిషా కొయిరాల, దియా మిర్జా, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, విక్కీ కౌశల్ తదితరులు కనిపించనున్నారు. ఇప్పటివరకు ఫ్లాప్ అంటే తెలియని రాజ్ కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

చివరగా ఈ సంజు చిత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుంది అని ఆశిస్తున్నాము....

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS