'ఘాజీ'తో అందరి దృష్టినీ ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డి. ఇప్పుడు 'అంతరిక్షం' సినిమాని ప్రేక్షకులకు అందించబోతున్నాడు. ఈ సినిమా కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశాడట సంకల్ప్‌రెడ్డి. కొంతమంది శాస్త్రవేత్తల్ని కలిసి జీరో గ్రావిటీ గురించి తెలుసుకున్నాడట. అలాగే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న చాలా సమాచారాన్ని పరిశీలించాడట. క్రిష్ ఈ సినిమా విషయంలో సంకల్ప్‌కి చాలా తోడ్పాటునందించాడట. క్రిష్ సమర్పణలోనే ఈ సినిమా విడుదలవుతోంది.
ఇదిలా ఉంటే, ఈ డైరెక్టర్‌కి త్వరలోనే హిందీలోనూ అడుగుపెట్టే అవకాశం లభించిందట. రెండు హిందీ సినిమాలకు సంకల్ప్‌రెడ్డి సైన్ చేశాడట. అయితే హిందీలో సినిమా అంటే టెక్నీషియన్లు, నటీ నటులు కుదరడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ లోగా తెలుగులో మరో చిత్రం కూడా చేసేస్తాను అంటున్నాడీ యంగ్ డైరెక్టర్. ఆల్రెడీ ఆ స్క్రిప్ట్ విషయంలోనూ ఓ ఐడియా మీదున్నాడట సంకల్ప్ రెడ్డి. 'అంతరిక్షం' సినిమా ఆయనకు డ్రీమ్ ప్రాజెక్ట్ అట. ఈ సినిమా ఇక్కడితో అయిపోదట. దీనికి సీక్వెల్ కూడా ఉందట. అన్నీ కుదిరితే 'అంతరిక్షం' విడుదలైన కొద్ది రోజుల్లోనే సీక్వెల్‌ని కూడా పట్టాలెక్కిస్తానంటున్నాడు.
ఇక 'అంతరిక్షం' సినిమా ముచ్చట్ల విషయానికి వస్తే, ఇందులో 1500 పైగా విజువల్ షాట్స్ ఉన్నాయట. జీరో గ్రావిటీలో దాదాపు 40 రోజులు షూటింగ్ చేశారట. టైం తక్కువే పట్టింది కానీ, ఖర్చు బాగానే అయ్యిందట. ప్రతీ సీన్‌ని ముందుగా యాక్షన్ ఫిగర్స్‌తో ట్రైల్ వేసి, తర్వాత చిత్రీకరించేవారట. అలా 'అంతరిక్షం' సినిమాని ఓ యజ్ఞంలా రూపొందించామని సంకల్ప్ చెబుతున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా అదితీరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.