బాలీవుడ్ సినిమాకు ఘాజీ డైరెక్టర్ సై.

మరిన్ని వార్తలు

'ఘాజి' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు సంకల్ప్ రెడ్డి. రానా దగ్గుబాటి హీరోగా సముద్రపు అడుగున జరిగే సబ్ మెరైన్ పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన ఆ సినిమా కమర్షియల్ గా విజయం సాధించడమే కాకుండా సంకల్ప్ ఫిలిం మేకింగ్ కు ప్రశంసలు లభించాయి. ఇదిలా ఉంటే సంకల్ప్ కొత్త సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

 

సంకల్ప్ రెడ్డి తన నెక్స్ట్ సినిమాను బాలీవుడ్ లో చేయబోతున్నాడని సమాచారం. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచే విద్యుత్ జమ్వాల్ హీరోగా సంకల్ప్ రెడ్డి ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. విద్యుత్ జమ్వాల్ హిందీ సినిమాలతో పాటుగా కొన్ని తెలుగు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాడు. హిందీలో 'కమాండో' సీరీస్ సినిమాలలో హీరోగా నటించాడు.

 

ఈ సినిమా దేశరక్షణ కోసం భారతీయ వైమానిక దళం చేసే సాహసాల నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. కథ ప్రకారం ఈ సినిమాను ఢిల్లీ, ముంబై, కోల్ కతా నగరాల్లో ఎక్కువగా చిత్రీకరణ జరపాల్సి ఉంటుందట. ఈ సినిమాను నిర్మించేందుకు ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చిందని సమాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS