ముగ్గురు తాగుబోతుల గోల‌

By iQlikMovies - December 12, 2019 - 10:26 AM IST

మరిన్ని వార్తలు

హ్యాంగోవ‌ర్ నేప‌థ్యంలో చాలా సినిమాలొచ్చాయి. న‌రేష్ `యాక్షన్‌` క‌థ అలాంటిదే. ఆ సినిమాని త్రీడీలో తీసి నానా హ‌డావుడి చేశారు. నిన్న‌టికి నిన్న `భాగ్య‌న‌గ‌ర వీధుల్లో` అనే మ‌రో సినిమా వ‌చ్చింది. శ్రీ‌నివాస‌రెడ్డి ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు. ఇది కూడా హ్యాంగోవ‌ర్ టైపు సినిమానే.

 

ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో సినిమా వ‌చ్చి చేరింది. అదే.. 'తాగితే తందానా'. అదిత్‌,స‌ప్త‌గిరి, మ‌ధునంద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఫుల్లుగా తాగిన ఈ ముగ్గురూ చేసే హ‌డావుడే ఈ సినిమాకి నేప‌థ్యం. శ్రీ‌నాథ్ బ‌దినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించాడు. టీజ‌ర్ ఈరోజు విడుద‌లైంది. ఓ రాత్రి జ‌రిగిన‌క‌థ ఇది. కామెడీకి క్రైమ్ ఎలిమెంట్స్ జోడించారు. స‌ప్త‌గిరి, మ‌ధునంద‌న్ ఉన్నారు కాబ‌ట్టి కామెడీకి ఢోకా లేద‌నుకోవొచ్చు. త్వ‌ర‌లోనే ఈ సినిమాని విడుద‌ల చేయబోతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS