పోలీసులకు క్షమాపణలు చెప్పిన శ్రియ.!

By iQlikMovies - December 12, 2019 - 10:22 AM IST

మరిన్ని వార్తలు

లండన్‌ పోలీసులకు అందాల భామ శ్రియ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఎందుకు.? ఏంటీ.? అనే వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం శ్రియ 'సందకారి' అనే ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ లండన్‌లోని స్టాన్‌స్టెడ్‌ విమానాశ్రయంలో జరుగుతోంది.

 

షూటింగ్‌ జరుగుతున్న సమయంలో పొరపాటున శ్రియ ప్రోహిబిటెడ్‌ ఏరియాలోకి ప్రవేశించింది. దాంతో ఆమెను పోలీసులు చుట్టుముట్టారు. సరైన పత్రాలు లేకుండా ఈ ఏరియాలోకి ప్రవేశించరాదనీ, ఎందుకు ప్రవేశించాల్సి వచ్చిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ సమీపంలో ఉన్న హీరో విమల్‌ వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని పోలీసులకు వివరించి, షూటింగ్‌ నిమిత్తం వచ్చామనీ, ప్రూఫ్స్‌ చూపించడంతో పోలీసులు శ్రియని వదిలేశారు. చేసిన తప్పుకు శ్రియ, పోలీసులకు క్షమాపణలు తెలిపింది. ఆ తర్వాత షూటింగ్‌ యథాతథంగా జరిగింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS