గ్లామ్‌షాట్‌: బ్లూ హాట్‌ బికినీ 'పంజా'.!

By iQlikMovies - January 16, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

ఈ ముద్దుగుమ్మని గుర్తుపట్టారా.? ఎక్కడో చూసినట్లుంది కదా. అవును పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన 'పంజా' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పేరు సారా జేన్‌డియాస్‌. బక్క పలచని అందాలతో ట్రెడిషనల్‌ వేర్‌లో కనిపించి సందడి చేసింది. ఆ సినిమాలో ఈ బ్యూటీలోని గ్లామర్‌ పెద్దగా ఎలివేట్‌ కాలేదు. కానీ నిజానికి బాలీవుడ్‌ నుండి దిగుమతి అయిన ఈ పాపకు గ్లామర్‌ కొత్తేమీ కాదు. అక్కడ పలు చిత్రాల్లో విచ్చలవిడిగా అందాలారేసేసింది. 

 

అమ్మడి ఇన్‌స్టాగ్రామ్‌ చెక్‌ చేసినా ఆమెలోని గ్లామర్‌ మెరుపులు ఇన్నా.? అని ఆశ్చర్యపోక తప్పదు. తాజాగా బ్లూ కలర్‌ హాట్‌ బికినీలో ఇదిగో అమ్మడి గ్లామర్‌ పంజా చూశారుగా, కళ్లకు కూలింగ్‌ గ్లాస్‌ ఆమె అందానికి మరో ఆకర్షణగా నిలుస్తోంది. ప్రస్తుతం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. కానీ ఏదో అవకాశాల కోసం ఇదిగో ఇలా ట్రై చేస్తుంటుంది. 'పంజా' తర్వాత అయితే తెలుగులో మళ్లీ కనిపించలేదు ఈ అందాల భామ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS